కూడంకుళం సమీపంలో నాటుబాంబులు పేలి ఐదుగురు మృతి | four killed in crude bomb blasting | Sakshi
Sakshi News home page

కూడంకుళం సమీపంలో నాటుబాంబులు పేలి ఐదుగురు మృతి

Nov 26 2013 9:00 PM | Updated on Sep 2 2017 1:00 AM

నగరంలో కుడంకుళం వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న కమిటీ నివాసాల్లో భారీ ప్రమాదం సంభవించింది.

చెన్నై: నగరంలో కూడంకుళం వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న కమిటీ నివాసాల్లో మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. మృతుల్లో మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని కూడంకుళం సమీపంలోని ఇదింతకారి గ్రామంలో నాటుబాంబులు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

 

ఈ ఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంటుకు సమీప గ్రామంలో సంభవించింది. అయితే కూడంకుళం నివాసాల్లో నాటుబాంబులు పేలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స మేరకు సమీప ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement