ఫ్లిప్‌కార్ట్‌కు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌ బై | Flipkart's COO quits; Krishnamurthy's grip tightens | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌కు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌ బై

May 31 2017 9:25 AM | Updated on Aug 1 2018 3:40 PM

ఫ్లిప్‌కార్ట్‌కు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌ బై - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌కు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌ బై

బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌కు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌ బై చెప్పారు.

ముంబై:  బెంగళూరుకు చెందిన  ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌కు  టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌  బై చెప్పారు.  కంపెనీలో టాప్ ర్యాంకింగ్ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, సీవోవో(చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌) నితిన్ సేథ్,రాజీనామా చేశారు.  వ్యక్తిగత కారణాల  రీత్యా  ఈ నిర్ణయం తీసుకున్నట్టు  మార్కెట్‌ వర్గాల విశ్వసనీయ సమాచారం.

లాజిస్టిక్స్ యూనిట్ ఎకార్టుకు బాధ్యత  వహిస్తున్న సేథ్‌, హెచ్ఆర్ విధులను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఇటీవల  సీఈవో గా బాధ్యతలు చేపట్టి కల్యాణ్‌ కృష్ణమూర్తి  సంస్థపై మరింత పట్టు సాధించినట్టు అయిందని విశ్లేషకులు బావిస్తున్నారు. మరోవైపు గత వారమే  హెచ్‌ఆర్‌ బాధ్యతలను  కల్యాణ్‌  చేపట్టినట్టు తెలుస్తోంది. అలాగే  సేథ్‌  రాజీనామాతో ఇకపై ఈ బాధ్యతలను కూడా సీఈవో   నిర్వహించనున్నారని సమచారం. అయితే ఈ వార్తలపై ఫ్లిప్‌కార్ట్‌  ఇంకా అధికారికంగా స్పందించాల్సింది ఉంది.

2016, ఫిబ్రవరి లో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా   ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన అతి తక్కువ సమయంలోనే సీవోవోగా నియమితులయ్యారు.


 

Advertisement
 
Advertisement
Advertisement