breaking news
Nitin Seth
-
ఫ్లిప్‌కార్ట్‌కు టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై
ముంబై: బెంగళూరుకు చెందిన ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్‌కు టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. కంపెనీలో టాప్ ర్యాంకింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీవోవో(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) నితిన్ సేథ్,రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ వర్గాల విశ్వసనీయ సమాచారం. లాజిస్టిక్స్ యూనిట్ ఎకార్టుకు బాధ్యత వహిస్తున్న సేథ్, హెచ్ఆర్ విధులను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఇటీవల సీఈవో గా బాధ్యతలు చేపట్టి కల్యాణ్ కృష్ణమూర్తి సంస్థపై మరింత పట్టు సాధించినట్టు అయిందని విశ్లేషకులు బావిస్తున్నారు. మరోవైపు గత వారమే హెచ్ఆర్ బాధ్యతలను కల్యాణ్ చేపట్టినట్టు తెలుస్తోంది. అలాగే సేథ్ రాజీనామాతో ఇకపై ఈ బాధ్యతలను కూడా సీఈవో నిర్వహించనున్నారని సమచారం. అయితే ఈ వార్తలపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారికంగా స్పందించాల్సింది ఉంది. 2016, ఫిబ్రవరి లో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన అతి తక్కువ సమయంలోనే సీవోవోగా నియమితులయ్యారు. -
మార్కెట్ వాటా తిరిగి పెంచుకుంటాం..
♦ మరిన్ని వేరియంట్లు తీసుకొస్తాం ♦ అశోక్ లేలాండ్ ఎల్సీవీ ప్రెసిడెంట్ నితిన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్సీవీ) విభాగంలో దేశీయంగా మార్కెట్ వాటాను తిరిగి పెంచుకుంటామని అశోక్ లేలాండ్ తెలిపింది. భారత ఎల్సీవీ విపణిలో 2012-13లో కంపెనీకి 18 శాతం వాటా ఉండేది. ఆ తర్వాతి సంవత్సరానికి ఇది 14 శాతానికి చేరింది. ఏటా 1.9 లక్షల యూనిట్లు విక్రయమవుతున్న ఈ విభాగంలో ప్రస్తుతం సంస్థకు 16 శాతం వాటా ఉంది. ఎల్సీవీ అయిన దోస్త్, మినీ ట్రక్-పార్టనర్, మినీ బస్-మిత్ ్రప్లాట్ఫాంపై మరిన్ని మోడళ్లను తీసుకురావడం ద్వారా తిరిగి వాటాను చేజిక్కించుకుంటామని కంపెనీ ఎల్సీవీ, డిఫెన్స్ విభాగం ప్రెసిడెంట్ నితిన్ సేథ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. మార్కెట్ మళ్లీ పుంజుకుంటోందని చెప్పారు. ‘మూడేళ్లలో 1 లక్ష దోస్త్ వాహనాలను కంపెనీ విక్రయించింది. మరో లక్ష దోస్త్ వాహనాలను రెండున్నరేళ్లలోనే అమ్మాలన్నది లక్ష్యం. ఇక మినీ స్కూల్ బస్‌ల విభాగంలో అపార అవకాశాలున్నాయి. మిత్ ్రప్లాట్ఫామ్ ద్వారా ఈ విభాగంలో పట్టు సాధిస్తాం. భారత ప్రభుత్వం నిర్దేశించిన భద్రత ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ వాహనం డిజైన్ చేశాం’ అని తెలిపారు. త్వరలో 32, 36, 40 సీట్ల సామర్థ్యంతో ఏసీ బస్‌లను మిత్ ్రప్లాట్ఫాంపై తీసుకొస్తామని వెల్లడించారు. పాఠశాల బస్‌ల నూతన భద్రత ప్రమాణాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి.