వేరుశెనగ పంటను పరిశీలించిన వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

వేరుశెనగ పంటను పరిశీలించిన వైఎస్ జగన్

Published Mon, Aug 17 2015 10:35 AM

farmers met ys jagan mohan reddy in anantapur district

అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలోని ఎండిపోయిన వేరుశెనగ పంటను పరిశీలించారు. బెంగళూరు నుంచి పులివెందుల వెళుతున్న ఆయన ఈరోజు ఉదయం గోరంట్ల మండలం బీదరెడ్డిపల్లి వద్ద ఎండిన వేరుశెనగ పంటను పరిశీలించారు.  రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.  

అష్టకష్టాలు పడి వేరుశెనగ పంటను సాగుచేశామంటూ...  తాము పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, కరువుపై రైతులు ... వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అంటూ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో ఉండనున్నారు. ఆయన 19వ తేదీ రాత్రికి తిరిగి హైదరాబాద్  బయల్దేరి వెళతారు.
 

Advertisement
Advertisement