అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Farmer commits suicide by debt problems | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Aug 12 2015 4:14 PM | Updated on Sep 29 2018 7:10 PM

వర్షాలు లేకపోవడం, అప్పుల బాధతో ఉరివేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వెల్దుర్తి(కర్నూలు జిల్లా): వర్షాలు లేకపోవడం, అప్పుల బాధతో ఉరివేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పిక్కిలివానిపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన శివరాముడు(45)తన 8ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది వర్షాలు సరిగా కురియకపోవడంతో పంట సాగు చేయలేదు.

అయితే, గతంలో చేసిన రూ. 3లక్షల అప్పుకు వడ్డీ పెరిగిపోతుండటంతో మనస్తాపం చెందాడు. వర్షాలు లేక కొత్తగా పంటసాగు చేయలేని పరిస్థితిలో బుధవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement