షాకింగ్: స్పీకర్ కుర్చీలో డీఎంకే ఎమ్మెల్యేలు! | dmk mlas sit on speaker chair in tamilnadu assembly | Sakshi
Sakshi News home page

షాకింగ్: స్పీకర్ కుర్చీలో డీఎంకే ఎమ్మెల్యేలు!

Feb 18 2017 1:09 PM | Updated on Sep 5 2017 4:02 AM

షాకింగ్: స్పీకర్ కుర్చీలో డీఎంకే ఎమ్మెల్యేలు!

షాకింగ్: స్పీకర్ కుర్చీలో డీఎంకే ఎమ్మెల్యేలు!

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ ధనపాల్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తర్వాత డీఎంకే సభ్యులు కొందరు ఆయనను తోసేసే ప్రయత్నం కూడా చేశారు. దాంతో ఆయన మార్షల్స్ సాయంతో జాగ్రత్తగా సభ నుంచి బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీలో కూడా కూర్చున్నారు. 
 
డీఎంకేకు చెందిన కు కా సెల్వం, రంగనాథన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా కూర్చున్నారు. ఈ పరిస్థితి ఇంతవరకు దేశంలో ఎక్కడా చోటుచేసుకున్న దాఖలాలు లేవు. స్పీకర్ కుర్చీలో ప్రతిపక్ష సభ్యులు కూర్చోవడం, అది కూడా అధికారికంగా కాకుండా అనధికారికంగా గొడవ చేసి, స్పీకర్‌ను పంపేసి ఆయన స్థానంలో ఒక నిమిషం కంటే కూడా తక్కువ సేపు కూర్చోవడం ఎప్పుడూ లేదు. తమిళనాడు అసెంబ్లీ మాత్రమే ఈ ఘటనకు అద్దం పట్టింది. 
Advertisement
 
Advertisement
Advertisement