శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్

Sep 5 2015 8:33 AM | Updated on Jul 29 2019 2:44 PM

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర డీజీపీ జేవీ.రాముడు శనివారం దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర డీజీపీ జేవీ.రాముడు శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్, డీజీపీలకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటలు, సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. కాగా, నేడు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement