మోదీ కన్నీళ్లు పెడుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు | Demonetization: PM Modi blackmailing people, says Mayawati | Sakshi
Sakshi News home page

మోదీ కన్నీళ్లు పెడుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు

Nov 26 2016 7:56 PM | Updated on Sep 27 2018 9:08 PM

మోదీ కన్నీళ్లు పెడుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు - Sakshi

మోదీ కన్నీళ్లు పెడుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి .. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి .. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధికోసమే ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారని, ఆయన కన్నీళ్లు పెడుతూ ప్రజలను ఎమోషనల్‌గా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో విపక్షాలతో మాట్లాడేందుకు మోదీ జంకుతున్నారని మాయావతి అన్నారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి ఒనగూడేదేమీ లేదని, ఆర్థిక ఎమర్జన్సీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాయావతి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం గాక దేశ ప్రయోజనాల దృష్ట్యానే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల బీజేపీ నేతలకు ఎలాంటి ఆందోళన లేదని, వాళ్లు ముందే బ్లాక్‌ మనీని సర్ధుకున్నారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో అల్లర్లు చెలరేగితే దానికి మోదీయే బాధ్యత వహించాలని మాయావతి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement