మంత్రి పరార్.. పోలీసుల గాలింపు | Controversial UP minister Prajapati goes missing as police close in | Sakshi
Sakshi News home page

మంత్రి పరార్.. పోలీసుల గాలింపు

Mar 1 2017 9:28 AM | Updated on Aug 25 2018 5:10 PM

మంత్రి పరార్.. పోలీసుల గాలింపు - Sakshi

మంత్రి పరార్.. పోలీసుల గాలింపు

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతి అజ్ఞాతంలోకి వెళ్లారు.

లక్నో: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

తనపై, తన మైనర్‌ కూతురుపై ప్రజాపతి ఆయన అనుచరులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం అమేథిలోని మంత్రి ఇంట్లో సోదాలు చేశారు. ఆయన అంతకుముందే లక్నో వెళ్లినట్టు తెలుసుకున్న పోలీసులు లక్నోలోని మంత్రి బంగ్లాకు వెళ్లగా అక్కడ కూడా ఆయన లేరు. మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు లక్నో ఎస్పీ చెప్పారు. ఆయనను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.

యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్ ఇటీవల ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించారు. ములాయం విధేయుడైన ప్రజాపతిని ఆయన సూచన మేరకు అఖిలేష్ మళ్లీ కేబినెట్‌లో చేర్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున అమేథి నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేష్ ఇటీవల అమేథికి ప్రచారానికి వెళ్లినపుడు ప్రజాపతిని వేదికపైకి అనుమతించలేదు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతిని అఖిలేష్‌ మంత్రివర్గంలో కొనసాగించడంపై ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement