మార్కెట్లో ఎల్పీజీ ‘గో’ గ్యాస్ | Confidence Petroleum India Ltd launch LPG cylinders | Sakshi
Sakshi News home page

మార్కెట్లో ఎల్పీజీ ‘గో’ గ్యాస్

Oct 29 2013 12:42 AM | Updated on Sep 2 2017 12:04 AM

మార్కెట్లో ఎల్పీజీ ‘గో’ గ్యాస్

మార్కెట్లో ఎల్పీజీ ‘గో’ గ్యాస్

ఎల్పీజీ సిలిండర్ల తయారీ కంపెనీ కాన్ఫిడెన్స్ పెట్రోలియం సంస్థ వంటగ్యాస్‌ను మరింత అందుబాటులో తెచ్చేందుకు...

సాక్షి, హైదరాబాద్: ఎల్పీజీ సిలిండర్ల తయారీ కంపెనీ కాన్ఫిడెన్స్ పెట్రోలియం సంస్థ వంటగ్యాస్‌ను మరింత అందుబాటులో తెచ్చేందుకు మార్కెట్లోకి ‘గో గ్యాస్’ను ప్రవేశపెడుతున్నట్లు ఆసంస్థ రాష్ర్ట మేనేజర్ కె.జె.రవికాంత్, కమ్యూనికేషన్ మేనేజర్ సామీర్ ములేలు తెలిపారు. సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో వారు ఎల్పీజీ గోగ్యాస్ బ్రోచర్‌తో కమర్షియల్ సిలిండర్‌ను విడుదల చేశారు.
 
వినియోగదారులు బుకింగ్  చేసిన వెంటనే  సిలిండర్లు అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు రవికాంత్, సామీర్ ములే లు వెల్లడించారు. ఎల్‌పీజీ అవుట్లెట్స్‌తో పాటు ఆ సిలిండర్లు స్టాక్ ఉండేవిధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సెలవు దినాలతో నిమిత్తం లేకుండా నిరంతరం సిలిండర్ల డెలివరీ జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్‌ను ప్రవేశ పెట్టామని, త్వరలో  నాలుగు కేజీల నుంచి 21 కేజీల సిలిండర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement