123 కు చేరిన చైనా మృతుల సంఖ్య | China blasts toll rises to 123 | Sakshi
Sakshi News home page

123 కు చేరిన చైనా మృతుల సంఖ్య

Aug 23 2015 6:46 PM | Updated on Sep 3 2017 8:00 AM

చైనా పేలుళ్ల మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. రాజధాని బీజింగ్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టియాన్‌జెన్‌ మున్సిపాలిటిలోని పారిశ్రామికవాడలో భారీ పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య మరింత పెరిగింది.

బీజింగ్‌: చైనా పేలుళ్ల మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. రాజధాని  బీజింగ్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టియాన్‌జెన్‌ మున్సిపాలిటిలోని పారిశ్రామికవాడలో భారీ పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య మరింత పెరిగింది.  ఆదివారం నాటికి మృతుల సంఖ్య 123 కు చేరినట్లు అధికారులు తెలిపారు.  ఇంకా 624 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వీరిలో 44 మంది పరిస్థితి మాత్రం విషమంగా ఉందన్నారు.

 

ఈ ఘటనలో బాధితుల గుర్తింపు వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఇంకా 89 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వీరిలో 50 మంది పౌరులతో పాటు 34 అగ్నిమాపక సిబ్బంది ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement