ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ప్రశ్నించనున్న సీబీఐ! | CBI may question Odisha CM Naveen Patnaik | Sakshi
Sakshi News home page

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ప్రశ్నించనున్న సీబీఐ!

Oct 17 2013 8:43 PM | Updated on Sep 1 2017 11:44 PM

హిండాల్కో కంపెనీకి బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను సీబీఐ ప్రశ్నించనుంది.

హిండాల్కో కంపెనీకి  బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను సీబీఐ ప్రశ్నించనుంది. 2005 లో ఆదిత్య బిర్లా కంపెనీని తిరస్కరించిన తర్వాత బొగ్గు శాఖ కు నవీన్ పట్నాయక్ లేఖ రాసిన అంశపై సీబీఐ విచారించే అవకాశం ఉంది. 
 
ఒడిశాలోని తలబిరా రెండవ బ్లాక్ కోసం దరఖాస్తు చేసుకున్న హిండాల్కో కంపెనీ తిరస్కారానికి గురైన తర్వాత పున: పరిశీలించాలని పట్నాయక్ లేఖ రాశారని సీబీఐ అధికారి తెలిపారు. పట్నాయక్ రాసిన లేఖలు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిని విచారించాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయం జరుగలేదని తెలిసింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement