ప్రాణం తీసిన పది రూపాయలు | Brawl over Rs 10 claims life of 35-yr-old man | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన పది రూపాయలు

Jan 28 2015 3:02 AM | Updated on Aug 21 2018 7:17 PM

ప్రాణం తీసిన పది రూపాయలు - Sakshi

ప్రాణం తీసిన పది రూపాయలు

పది రూపాయల విషయంలో చికెన్ షాపు యజమానికి, కస్టమర్లకు మధ్య తలెత్తిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.

 ముంబై: పది రూపాయల విషయంలో చికెన్ షాపు యజమానికి, కస్టమర్లకు మధ్య తలెత్తిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మధ్య ముంబైలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో చికెన్ షాపు యజమాని ఫిరోజ్ షేక్(35) మరణించాడు.నిందితులు కుందన్ చౌదరి, సంజయ్ భారతి, దామోదర్ సాహూలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వడ పావ్ షాపులో పనిచేసే నిందితులు, షేక్ షాపులో రూ. 105ల చికెన్ తీసుకున్నారు. కానీ, షేక్ 115 రూపాయలను వసూలు చేశాడు. దీంతో పది రూపాయల విషయంలో వివాదం చెలరేగింది. నిందితులు ముగ్గురు షేక్‌పై దాడికి దిగడంతో ఆయన స్పృహ కోల్పోయాడు. నిందితుల్లో చౌదరిని స్థానికులు అక్కడే పట్టుకోగా, మిగిలిన ఇద్దరు పారిపోయారు. షేక్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగిలిన ఇద్దర్ని వారి నివాసాల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులకు కోర్టు ఈనెల 30 వరకు పోలీసు కస్టడీ విధించినట్లు సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement