బ్యాంకు సిబ్బంది మళ్లీ సమ్మె సైరన్ | bank staff to strike again | Sakshi
Sakshi News home page

బ్యాంకు సిబ్బంది మళ్లీ సమ్మె సైరన్

Dec 24 2013 1:59 AM | Updated on Jun 2 2018 5:51 PM

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ రెండు రోజుల సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చాయి.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ రెండు రోజుల సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా జనవరి 20 నుంచి 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. అప్పటికీ దిగిరాకపోతే ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిరవధిక సమ్మెకూ వెనుకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్కరణల నిలిపేత, తక్షణం వేతన సవరణ సిఫార్సుల అమలుకు డిమాండ్ చేస్తూ ఈ నెల 18న బ్యాంకు యూనియన్లు ఒక రోజు సమ్మె చేయడం తెలిసిందే. తదుపరి కార్యాచరణకు సోమవారం బ్యాంకు యూనియన్లు హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన పది లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నట్లు రాంబాబు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement