పార్టీ చీఫ్‌ సహా ఎమ్మెల్యేందరూ జంప్ | All four Trinamool MLAs join Congress in Manipur | Sakshi
Sakshi News home page

పార్టీ చీఫ్‌ సహా ఎమ్మెల్యేందరూ జంప్

Sep 18 2016 5:55 PM | Updated on Sep 4 2017 2:01 PM

పార్టీ చీఫ్‌ సహా ఎమ్మెల్యేందరూ జంప్

పార్టీ చీఫ్‌ సహా ఎమ్మెల్యేందరూ జంప్

తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

ఇంఫాల్: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం మణిపూర్ టీఎంసీ చీఫ్ శ్యాంకుమార్ సహా ఆ రాష్ట్రంలో పార్టీకి చెందిన మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.

టీఎంసీ జాతీయ నేతలు తమను నిర్లక్ష్యంగా చూస్తున్నరని, పార్టీని వీడాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు శ్యాంకుమార్ చెప్పారు. మణిపూర్ సమస్యలను తృణమాల్ కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకోవడం లేదని, ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని  కోరితే నిరాకరించారని ఆరోపించారు. 2012 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. కాగా గతేడాది మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేను సభకు అనుమతించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యుంఖమ్ ఎరబొట్ ఇటీవల బీజేపీలో చేరారు. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు చేరడంతో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement