విమానం ల్యాండవుతుండగా పేలిన టైరు | Air India plane suffers tyre burst at Mumbai airport; passengers safe | Sakshi
Sakshi News home page

విమానం ల్యాండవుతుండగా పేలిన టైరు

Oct 18 2016 12:04 PM | Updated on Sep 4 2017 5:36 PM

విమానం ల్యాండవుతుండగా పేలిన టైరు

విమానం ల్యాండవుతుండగా పేలిన టైరు

ఎయిర్ ఇండియా వియానం ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తున్న ఎ1 614 విమానం ల్యాండ్ అవుతుండగా టైర్ పేలిపోయింది.

ముంబై: ఎయిర్ ఇండియా వియానం ముంబై లోని  ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది.    అహ్మదాబాద్ నుంచి  ముంబైకి వస్తున్న ఎ1 614 విమానం ల్యాండ్ అవుతుండగా  టైర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారి కలకలం రేగింది.  128 మంది ప్రయాణికులు,  సిబ్బందితో వస్తుండగా మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే ప్రయాణీకులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.  నిర్దేశిత సమయానికి మరో విమానాన్ని  ఏర్పాటు చేశామని, ప్రయాణికులు  ఆందోళన  చెందాల్సిన అవసరం లేదని  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement