రాష్ట్రంలో గ్రీన్ హౌస్‌ల ఏర్పాటుకు సంబంధించి 70 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
చిత్తూరు: రాష్ట్రంలో గ్రీన్ హౌస్‌ల ఏర్పాటుకు సంబంధించి 70 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇప్పటి వరకు 50 శాతం సబ్సిడీ ఉండగా, రైతుల విజ్ఞప్తి మేరకు దీనిని 70 శాతానికి పెంచుతున్న సీఎం వెల్లడించారు.
కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు బుధవారం గుడుపల్లె మండలం గుడివంక గ్రామం వద్ద జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు గ్రీన్‌హౌస్‌లు లాభదాయకంగా ఉంటాయన్నారు. వీటి ఏర్పాటు వల్ల నీటిని ఆదా చేయవచ్చన్నారు. కనుక గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలన్నారు.