దేవుడా.. ఎంత ఘోరమయ్యా.. | 4 died in road accident | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఎంత ఘోరమయ్యా..

Aug 22 2015 1:34 AM | Updated on Sep 28 2018 3:27 PM

దేవుడా.. ఎంత ఘోరమయ్యా.. - Sakshi

దేవుడా.. ఎంత ఘోరమయ్యా..

తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో నలుగురిని శుక్రవారం ఏపీలోని

 * శ్రీవారి దర్శనానికి వస్తుండగా ఢీకొన్న డీజిల్ ట్యాంకర్
 * ఏపీలో ఒకే కుటుంబంలో నలుగురి మృ
తి
బంగారుపాళెం: తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో నలుగురిని శుక్రవారం ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలో డీజిల్ ట్యాంకర్ రూపంలో మృత్యువు కబళించింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా, పావగడ తాలూకా, మారణహళ్లికి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆరుగురు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కారులో తిరుమలకు బయలుదేరారు.

మార్గం మధ్యలో బంగారుపాళెం మండలం శేషాపురం గ్రామం వద్ద వీరి కారును, యాదమరి మండలం నుంచి బి.కొత్తకోటకు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీనివాస్(37), అతని భార్య శ్వేత(30), తాత హనుమంతరెడ్డి(75) అక్కడికక్కడే మరణించగా తల్లి సువర్ణమ్మ(54) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తండ్రి వెంకట్రామరెడ్డి(61) తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసరెడ్డి కుమార్తె శ్రీవాత్స(7) స్వల్ప గాయంతో బయటపడింది. డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement