ముగిసిన సండ్ర ఏసీబీ కస్టడీ | 2nd day ACB custody of sandra venkata veeraiah concluded | Sakshi
Sakshi News home page

ముగిసిన సండ్ర ఏసీబీ కస్టడీ

Jul 10 2015 2:49 PM | Updated on Aug 17 2018 12:56 PM

ముగిసిన సండ్ర ఏసీబీ కస్టడీ - Sakshi

ముగిసిన సండ్ర ఏసీబీ కస్టడీ

ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రెండో రోజు ఏసీబీ కస్టడీ ముగిసింది.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రెండో రోజు ఏసీబీ కస్టడీ ముగిసింది. శుక్రవారం ఏసీబీ అధికారులు సండ్రను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

వైద్య పరీక్షలు చేయించిన అనంతరం సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఓటుకు కోట్లు కేసులో సండ్రను రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. గురువారం కూడా ఏసీబీ అధికారులు సండ్రను విచారించారు. ఈ రోజుతో సండ్ర ఏసీబీ కస్టడీ ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement