టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాగ్వివాదం | Zilla parishad meeting in Mahabubnagar | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాగ్వివాదం

Sep 4 2015 3:55 PM | Updated on Mar 18 2019 7:55 PM

మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ సమావేశం రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది.

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ సమావేశం రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది. శుక్రవారం సమావేశం ప్రారంభమైన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డిలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు.

ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిల మధ్య కూడా వాదులాట జరిగింది. దీంతో బాలరాజు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యులు మాట్లాడుతుండగా వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement