రాజ్‌భవన్‌లో వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ | YS Jagan, KCR Attend Iftar Party At Raj Bhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన వైఎస్‌ జగన్, కేసీఆర్‌

Jun 1 2019 5:48 PM | Updated on Jun 1 2019 9:26 PM

YS Jagan, KCR Attend Iftar Party At Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో జరిగిన ఇఫ్తార్‌ విందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు అయ్యారు. ఇరువురు ముఖ్యమంత్రులు స్వీట్లు తినిపించుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ముస్లిం సోదరులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. కాగా అంతకు ముందు గవర్నర్‌ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు ఉమ్మడి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ వచ్చారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ

గవర్నర్‌ను కలిసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు





(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement