యువకుడిపై గొడ్డలితో దాడి | young man attacked by axe in hyderabad | Sakshi
Sakshi News home page

యువకుడిపై గొడ్డలితో దాడి

Apr 27 2015 8:50 PM | Updated on Sep 3 2017 12:59 AM

గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం హైదరాబాద్ మూసాపేటలో ఉన్న జనతానగర్ కాలనీలో జరిగింది.

మూసాపేట (హైదరాబాద్) :గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం హైదరాబాద్ మూసాపేటలో ఉన్న జనతానగర్ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన కె.గిరి(18) అనే వ్యక్తి హైదరాబాద్లో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే జనతానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. అయితే సోమవారం సాయంత్రం గుర్తుతెలియని దుండుగులు గిరిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.

 

దీంతో అతనిని స్థానికులు మెరుగైన వైద్యం కోసం కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యువకుడిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమా? లేక స్నేహితులు కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement