అమెజాన్ గోదాము వద్ద కార్మికుల ధర్నా | workers dharna at amazon | Sakshi
Sakshi News home page

అమెజాన్ గోదాము వద్ద కార్మికుల ధర్నా

Aug 13 2015 1:40 PM | Updated on Sep 3 2017 7:23 AM

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని అమెజాన్ కంపెనీ గోదాము ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు.

కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని అమెజాన్ కంపెనీ గోదాము ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. జీతాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సకాలంలో వేతనాలు చెల్లించాలని, నిబంధనల ప్రకారం జీతాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరిపి, యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తానని హామి ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement