breaking news
amezan
-
షాపర్స్ స్టాప్‌లో అమెజాన్ పెట్టుబడులు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ ఇండియా, మరో రీటైల్ మేజర్ షాపర్స్ స్టాప్‌లో వాటాలను కొనుగోలు చేసింది. ఈ మేరకు షాపర్స్ స్టాప్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ రూ.179 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేయనుంది. రూ. 179.26 కోట్ల విలువైన వాటాను షాపర్స్ స్టాప్ అమెజాన్‌కు విక్రయించనుంది. ఈ నేపథ్యంలో ఎన్బీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ చెందిన షేర్లను ప్రిఫెరెన్షియల్ బేసిస్ కింద అమెజాన్‌కు కేటాయించనుంది. మరోవైపు అమెజాన్ ఇండియాలో తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాణిజ్యపరమైన ఒప్పందం కుదుర్చుకున్నామని షాపర్స్ స్టాప్ ఇటీవల బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో అధికారిక వెబ్సైట్లతో పాటు, ఇకపై అమెజాన్‌లో కూడా తమ ఉత్పత్తులు ప్రత్యేకంగా లభ్యంకానున్నాయని తెలిపింది. మొత్తం పోర్ట్‌ఫోలియో జాబితాలో 500 బ్రాండ్లు అమెజాన్ మార్కెట్ లో లభ్యం కానున్నాయి. అలాగే షాపర్స్ స్టాప్ లిమిటెడ్ కూడాతన ఫిజికల్ నెట్‌వర్క్‌లో ఫ్యాషన్ కోసం ప్రత్యేకమైన అమెజాన్ అనుభవ కేంద్రాలను సృష్టిస్తుందని ఫైలింగ్‌లో తెలిపింది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న కస్టమర్ బేస్‌ను మరింత పెంచుకోవడానికి ఇద్దరు భాగస్వాములు ఒకరిబలాన్ని మరొకరు పెంచుకోనున్నామని అమెజాన్ ఇండియా ఫాషన్ బిజినెస్ హెడ్ అరుణ్ సర్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. -
అమెజాన్ గోదాము వద్ద కార్మికుల ధర్నా
కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని అమెజాన్ కంపెనీ గోదాము ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. జీతాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సకాలంలో వేతనాలు చెల్లించాలని, నిబంధనల ప్రకారం జీతాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరిపి, యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తానని హామి ఇచ్చారు.