విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి | Women farmer 's death with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి

Oct 31 2015 2:45 PM | Updated on Sep 5 2018 2:26 PM

పొలంలో నీళ్ల కోసం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ మహిళా రైతు కరెంటు షాక్ తో మృతి చెందింది.

పొలంలో నీళ్ల కోసం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ మహిళా రైతు కరెంటు షాక్ తో మృతి చెందింది. ఈ ఘటన అదిలాబాద్ జిల్లా కడెం మండలం పాతకొండుకూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేల్పుల భూమక్క(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అయితే.. స్విచ్ వద్ద విద్యుత్ ప్రసారం కావడంతో.. ఆమె విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement