కారు బోల్తా: మహిళ దుర్మరణం | women died in road accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: మహిళ దుర్మరణం

Jul 23 2015 9:30 AM | Updated on Oct 8 2018 5:04 PM

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

మహబూబ్ నగర్(బాలానగర్): రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు... హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులతో కలసి తిరుపతికి వెళ్లి వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.

దీంతో కారులో ఉన్న వెంకటేశ్వరరావు భార్య సరళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావు అతని ఇద్దరి కుమార్తెలను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement