కొడుకు మాట వినడం లేదని.. | women commit suicide in medak district | Sakshi
Sakshi News home page

కొడుకు మాట వినడం లేదని..

May 25 2016 4:50 PM | Updated on Oct 16 2018 3:12 PM

నగరంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొడుకు సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చి తిరిగి వెళ్లకపోవడంతో మనస్థాపం చెంది ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

జోగిపేట: నగరంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొడుకు సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చి తిరిగి వెళ్లకపోవడంతో మనస్థాపం చెంది ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా జోగిపేటలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న ఆకుల ప్రమీల(55) కుమారుడు నగరంలో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన కొడుకు తిరిగి నగరానికి వెళ్లకపోవడంతో ఆగ్రహించిన ఆమె బుద్ధిగా వ్యాపారం చేసుకోమని పలుమార్లు చెప్పింది.

అయినా కొడుకు వెళ్లకపోవడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement