భర్తతో గొడవ పడి మహిళ మృతి | woman's suicide | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవ పడి మహిళ మృతి

Feb 3 2015 5:07 PM | Updated on Nov 6 2018 7:56 PM

పురుగుల మందు తాగి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది.

ఆదిలాబాద్: పురుగుల మందు తాగి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం మద్దికల్లు గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు..భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా కొత్తపల్లి ప్రమీల(40) సోమవారం పురుగుల మందు తాగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మృతి చెందింది. ప్రమీలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement