పెళ్లయిన వారానికే... ఆత్మహత్య | woman suicide in khammam district | Sakshi
Sakshi News home page

పెళ్లయిన వారానికే... ఆత్మహత్య

Mar 26 2016 12:03 PM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లయిన వారానికే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

ఖమ్మం: పెళ్లయిన వారానికే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం దిబ్బగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న చాతా ఆదిలక్ష్మి వివాహం ఈ నెల 21న అదే జిల్లాకు చెందిన బూర్గంపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. భర్తతో కలసి ఆదిలక్ష్మి దిబ్బగూడెంలోని తన తండ్రిగారింటికి వచ్చింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కారణాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement