రోడ్డుప్రమాదంలో మహిళ మృతి | woman dies of road accident in khammam district | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి

Jun 6 2015 1:47 PM | Updated on Aug 30 2018 3:58 PM

గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒక మహిళ మృతి చెందింది.

టేకులపల్లి (ఖమ్మం జిల్లా): గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కంకరమిల్లు సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలానికి చెందిన నూనావత్‌మేరీ (50) కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేది. కాగా, ఆమె రోడ్డు దాటుతుండగా ఒక గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది.

దీంతో ఆమె ఎగిరిపడి రోడ్డుపక్కనే ఉన్న చెత్తకుప్పల్లో పడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement