సెల్ చార్జింగ్ పెడుతూ మహిళ మృతి | Woman dies of electrocution while charging phone | Sakshi
Sakshi News home page

సెల్ చార్జింగ్ పెడుతూ మహిళ మృతి

Mar 29 2016 7:43 PM | Updated on Sep 3 2017 8:49 PM

సెల్ చార్జింగ్ పెడుతూ ఓ మహిళ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలం చిర్రకుంటతండాలో మంగళవారం జరిగింది.

గూడూరు (వరంగల్ జిల్లా) : సెల్ చార్జింగ్ పెడుతూ ఓ మహిళ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలం చిర్రకుంటతండాలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట మండలం ఎల్లాయగూడెం గ్రామానికి చెందిన బానోతు సునీత (25) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం తల్లిగారి ఇంటికి వెళ్లింది.

మంగళవారం తల్లి ఉండే ఇంట్లో సెల్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. సునీత తల్లి దేవ్లీ ఫిర్యాదు మేరకు ఎస్సై వై.సతీష్, విద్యుత్ ఏఈ రవికుమార్ అక్కడికి చేరుకున్నారు. కాగా సునీత భర్త ఆరు నెలల క్రితమే మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement