వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి, బంధువుల ధర్నా | Woman died due to Medical treatment fail over khammam | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి, బంధువుల ధర్నా

Nov 15 2014 6:47 AM | Updated on Sep 2 2017 4:31 PM

జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతిచెందింది.

ఖమ్మం: జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన అర్ధరాత్రి చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం సైదాబీ అనే మహిళను ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిసింది. ఆమెకు వైద్యులు చికిత్స అందించగా, వైద్యం వికటించి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

దాంతో వైద్యుల నిర్లక్షమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడి వైద్యులపై దాడికి యత్నించారు. తమకు న్యాయం చేయాలంటూ శవాన్ని ఆస్పత్రి ఎదుటే ఉంచి బంధువులు ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి బంధువులకు సర్దిచెప్పి వారిని శాంతింప చేసినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement