breaking news
family member strike
-
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి, బంధువుల ధర్నా
హైదరాబాద్ : వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందంటూ ఓ బాలింత బంధువులు పాతబస్తీలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ముందు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన కార్పెంటర్ రాజు భార్య సంతోషి (22) డెలివరీ కోసం ప్రసూతి ఆస్పత్రిలో ఈ నెల 18న చేరింది. ఆదివారం రాత్రి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వార్డులోని సిబ్బందికి తెలిపారు. వైద్యుడిని పిలిపించాలని కోరినా... ఎవరూ రాలేదు. రాత్రి 12.30 గంటల సమయంలో సంతోషి బిడ్డను ప్రసవించింది. శిశువు పుట్టిన గంట తర్వాత వైద్యులు వచ్చారు. అప్పటికే పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో సంతోషి బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులు సరైన సమయానికి రాకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. (షాలిబండ) -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి, బంధువుల ధర్నా
ఖమ్మం: జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన అర్ధరాత్రి చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం సైదాబీ అనే మహిళను ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిసింది. ఆమెకు వైద్యులు చికిత్స అందించగా, వైద్యం వికటించి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దాంతో వైద్యుల నిర్లక్షమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడి వైద్యులపై దాడికి యత్నించారు. తమకు న్యాయం చేయాలంటూ శవాన్ని ఆస్పత్రి ఎదుటే ఉంచి బంధువులు ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి బంధువులకు సర్దిచెప్పి వారిని శాంతింప చేసినట్టు సమాచారం.