వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి, బంధువుల ధర్నా | child died due to medical treatment fail ovar hyderabad | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి, బంధువుల ధర్నా

Feb 23 2015 2:10 PM | Updated on Sep 4 2018 5:16 PM

వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందంటూ ఓ బాలింత బంధువులు పాతబస్తీలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ముందు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందంటూ ఓ బాలింత బంధువులు పాతబస్తీలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ముందు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన కార్పెంటర్ రాజు భార్య సంతోషి (22) డెలివరీ కోసం ప్రసూతి ఆస్పత్రిలో ఈ నెల 18న చేరింది. ఆదివారం రాత్రి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వార్డులోని సిబ్బందికి తెలిపారు.

వైద్యుడిని పిలిపించాలని కోరినా... ఎవరూ రాలేదు. రాత్రి 12.30 గంటల సమయంలో సంతోషి బిడ్డను ప్రసవించింది. శిశువు పుట్టిన గంట తర్వాత వైద్యులు వచ్చారు. అప్పటికే పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో సంతోషి బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులు సరైన సమయానికి రాకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
(షాలిబండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement