
సాక్షి, గుంటూరు: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరో మహిళ మృతి చెందింది. చల్లా కృష్ణవేణికి తీవ్రంగా జ్వరం రావడంతో ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చల్లా కృష్ణవేణి ఇవాళ(అక్టోబర్ 5, ఆదివారం) మధ్యాహ్నం మరణించింది. చల్లా కృష్ణవేణి మృతితో గ్రామస్తుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇటీవలే తురకపాలెంలో 40 మందికిపైగా మృతిచెందారు.
ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది. తురకపాలెంలో తాజాగా తలెత్తిన మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మృత్యువాతకు గురైన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్ళలోపు వారే కావటం గమనార్హం.