ప్రియుడు దూరం కావడంతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రియుడు దూరం కావడంతో వివాహిత ఆత్మహత్య

Jun 18 2024 12:30 AM | Updated on Jun 18 2024 7:06 AM

-

అక్కిరెడ్డిపాలెం: జీవితంపై విరక్తితో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కాపురం దరి కాకరలోవ జై ఆంధ్రకాలనీకి చెందిన దండు భాను కుమార్తె స్వాతి (23)కి ఏడేళ్ల క్రితం వేపగుంట వద్ద గల చీమలాపల్లికి చెందిన కొప్పల దేవేంద్రకుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. కొన్నాళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా వారు దూరంగా ఉంటున్నారు. 

స్వాతి నాలుగేళ్లగా తల్లి వద్దనే ఉంటూ గాజువాకలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో మల్కాపురానికి చెందిన రోహిత్‌ కుమార్‌తో సన్నిహితంగా ఉండేది. కొద్ది రోజులుగా గాజువాకలోని ఓ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటోంది. స్వాతి కుమార్తె మల్కాపురంలో ఆమె తల్లి వద్ద ఉంటుంది. రెండు నెలల క్రితం స్వాతి భర్త దేవేంద్రకుమార్‌ అత్త వద్దకు వచ్చి తన కుమార్తెను తీసుకెళ్లి రెండు రోజుల్లో తీసుకొస్తానని చెప్పి తిరిగి తీసుకురాలేదు. 

దీంతో స్వాతి తన కూతురుతో పాటు రోహిత్‌ కూడా దూరం కావడంతో జీవితంపై విరక్తి చెంది హాస్టల్‌లో ఆదివారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన హాస్టల్‌ వార్డెన్‌ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి తల్లి దండు భాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఏఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement