భర్తపై కత్తిపీటతో దాడి | wife murder attempt on his husband | Sakshi
Sakshi News home page

భర్తపై కత్తిపీటతో దాడి

Apr 1 2015 9:39 AM | Updated on Jul 27 2018 2:18 PM

భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య కత్తీపీటతో అతనిపై దాడి చేసింది.

కరీంనగర్ : భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య కత్తిపీటతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం, పగడపల్లి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సైదయ్య, రమలు భార్యభర్తలు. మద్యానికి బానిసైన సైదులు ప్రతిరోజు తాగి వచ్చి మానసికంగా, శారీరకంగా హింసించేవాడు.

కాగా మంగళవారం సైదయ్య మద్యం తాగి భార్యను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దీంతో విసుగెత్తిన రమ కత్తిపీటతో సైదయ్య పై దాడి చేసింది. ఈ దాడిలో సైదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి రమను విచారిస్తున్నారు.
(కాల్వశ్రీరాంపూర్)

Advertisement
 
Advertisement
Advertisement