రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి | vro dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి

Jul 30 2015 10:30 PM | Updated on Sep 28 2018 3:41 PM

రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం చెందారు.

సదాశివపేట (రంగారెడ్డి జిల్లా): రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మోమిన్‌పేట మండలం దుర్గంచెరువు గ్రామ వీఆర్వో చంద్రయ్య (50), అదే గ్రామానికి చెందిన అంజయ్య గురువారం రాత్రి 7.30 సమయంలో సదాశివపేట నుంచి దుర్గంచెరువుకు బైక్‌పై వెళ్తున్నారు.

వికారాబాద్ రోడ్డు కొత్తచెరువు సమీపంలో వీరు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన చంద్రయ్యను 108 వాహనంలో సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. అంజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రయ్య మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహిస్తామని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement