నిలకడగా విద్యాసాగర్‌ ఆరోగ్యం | Vidyasagar Rao health is not serious, says doctors | Sakshi
Sakshi News home page

నిలకడగా విద్యాసాగర్‌ ఆరోగ్యం

Apr 25 2017 4:23 AM | Updated on Mar 19 2019 9:20 PM

నిలకడగా విద్యాసాగర్‌ ఆరోగ్యం - Sakshi

నిలకడగా విద్యాసాగర్‌ ఆరోగ్యం

విద్యాసాగర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని డాక్టర్లు వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటిరంగ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు రామరాజు విద్యాసాగర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కు స్పందిస్తున్నారని కాంటినెంటల్‌ ఆస్పత్రి డాక్టర్లు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ గురు ఎన్‌.రెడ్డి మధ్యాహ్నం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. రెండ్రోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆస్పత్రి ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనను నిరంతరం పరీక్షిస్తోందని చెప్పారు.

వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్యం మెరుగైతే 24 గంటల తర్వాత వెంటిలెటర్‌ తొలగిస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారని వివరించారు. కాగా, విద్యాసాగర్‌రావు చనిపోయారంటూ టీవీ చానళ్లు, సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం నిజం కాదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement