హైకోర్టు లో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన వరవరరావు | Varavara Rao Quash Petition In High Court | Sakshi
Sakshi News home page

Nov 6 2018 7:11 PM | Updated on Nov 6 2018 7:14 PM

Varavara Rao Quash Petition In High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహారాష్ట్ర పోలీసులు జారీ చేసిన ట్రాన్సిట్‌ వారెంట్‌ను కొట్టివేయాలని విరసం నేత వరవరరావు హైకోర్టులో క్వాష్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. భీమ్‌ కోరేగామ్‌ అల్లర్ల ఘటనలో భాగంగా వరవరరావు గృహనిర్భందంలో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందని కోర్టుకు తెలిపారు. పిటీషన్‌ను  విచారణకు స్వీకరించిన  హైకోర్టు.. మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వరవరరావు ఆరోగ్యంపై నిమ్స్‌ సూపరింటెండెంట్‌ నేతృత్వంలో ఆయన ఇంటికి వెళ్లి వైద్యం అందించాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement