రైతులను సన్మానించిన ‘మహర్షి’ చిత్రబృందం | Vamshi Paidipally Felicitated Farmers In Khanapur | Sakshi
Sakshi News home page

రైతులను సన్మానించిన ‘మహర్షి’ చిత్రబృందం

May 28 2019 3:43 PM | Updated on May 28 2019 3:45 PM

Vamshi Paidipally Felicitated Farmers In Khanapur - Sakshi

సాక్షి, నిర్మల్‌ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా వచ్చిన మహర్షి చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలె ఈ మూవీ వందకోట్లను కలెక్ట్‌ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి తన సొంత గ్రామమైన ఖానాపూర్‌లోని లక్ష్మీ థియేటర్‌లో సందడి చేశారు. అక్కడి రైతులకు మహర్షి సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. అంతేకాకుండా చిత్రయూనిట్‌ రైతులను ఘనంగా సన్మానించింది. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. తాను పుట్టిన ఊర్లోని సినిమా హాల్లో రైతులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement