‘నల్ల కుబేరులకు కొమ్ముగాస్తున్న మోదీ’ | V hanumanth rao comments on modi | Sakshi
Sakshi News home page

‘నల్ల కుబేరులకు కొమ్ముగాస్తున్న మోదీ’

Feb 24 2018 3:24 AM | Updated on Sep 19 2019 8:28 PM

V hanumanth rao comments on modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న నల్ల కుబేరులకు ప్రధాని నరేంద్ర మోదీ కొమ్ముగాస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రోజుకో అవినీతి, భారీ కుంభకోణాలతో ప్రజలను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంబానీలతో మోదీ అంటకాగుతూ పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. డబ్బులను బ్యాంకుల్లో వేయాలని పేద, మధ్య తరగతి ప్రజలకు చెప్పి నల్ల కుబేరులకు అప్పనంగా కట్టబెడుతున్నారని, ప్రజలను మోసం చేయడానికి ప్రోత్సహిస్తున్నారని వీహెచ్‌ ఆరోపించారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement