'ఫీజు రీయింబర్స్‌మెంట్ ఘనత కాంగ్రెస్ పార్టీదే'

Uttamkumarreddy fires on KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్ఎస్ నిర్వహిస్తోంది ప్రగతి నివేదన సభ కాదని, ప్రగతి ఆవేదన సభ అని టీపీసీసీ చీఫ్‌ కెప్టెన్‌. ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రెండోసారి రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడుగా ఎంపికైన బలమూర్ వెంకట్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడారు. విద్యార్థి లోకాన్నంతా ఏకం చేసి కాంగ్రెస్‌కు ఓటు వేసేలా ఎన్‌ఎస్‌యూఐ పనిచేయాలని సూచించారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలే కాంగ్రెస్ శక్తి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం కల్పిస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.

పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. కేసీఆర్‌కు కాంట్రాక్టర్స్‌కు ఇచ్చేందుకు డబ్బులున్నాయి, కానీ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చేందుకు డబ్బులు లేవా అంటూ మండిపడ్డారు. కేజీ టూ పీజీ అన్న కేసీఆర్ ఆ ఊసే మరిచారన్నారు. ప్రగతి నివేదన సభ పేరుతో దాదాపు రూ.300 కోట్ల అక్రమ సంపాదనను ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేక పోయారని నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయానని కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ కల్పనే తమ ప్రధాన ఎజెండా అని ఉత్తమ్‌ అన్నారు. ఉద్యోగాలు కల్పించలేని నిరుద్యోగులకు మూడువేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, వీహెచ్‌లతోపాటూ భారీగా ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top