‘ఉపాధి’ కూలీ పెంపు ఉత్తర్వులు జారీ | upadi wages hiked | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కూలీ పెంపు ఉత్తర్వులు జారీ

Apr 22 2015 2:20 AM | Updated on Sep 3 2017 12:38 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు వివిధ అభివృద్ధి పనుల్లో పని చేసే కూలీలకు రోజువారీ వేతనం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు వివిధ అభివృద్ధి పనుల్లో పని చేసే కూలీలకు రోజువారీ వేతనం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 169 వేతనాన్ని రూ. 180కి పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. కూలీల వేతనంతో పాటు వివిధ పనులకు సంబంధించిన గ్రామీణ ప్రామాణిక రేట్లు (రూరల్ స్టాండర్డ్ రేట్స్) పెంచుతూ షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement