విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి | two dies in current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

Feb 4 2015 7:26 PM | Updated on Aug 25 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఫతేపూర్ గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఫతేపూర్ గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన పెద్దోళ్ల గణేశ్ అనే రైతు పొలంలో విద్యుత్ మోటారు చెడిపోయింది. దీనిని బుధవారం సాయంత్రం బండి సాయినాథ్, చింతల నరేష్, ముత్యంలు వెళ్లి మరమ్మతు చేశారు. అనంతరం వారు మోటారును పరీక్షిస్తుండగా దానిపై ఉన్న ఇనుప పైపులు పైన వెళ్తున్న 11కేవీ కరెంట్ లైన్లకు తాకటంతో అక్కడే ఉన్న సాయినాథ్, నరేష్, గణేష్ షాక్ కు గురయ్యారు. సాయినాథ్, నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా..తీవ్రంగా గాయపడిన గణేష్‌ను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement