హోలీ పండుగలో విషాదం | Two children died in sangareddy district | Sakshi
Sakshi News home page

హోలీ పండుగలో విషాదం

Mar 1 2018 4:22 PM | Updated on Mar 1 2018 4:31 PM

Two children died in sangareddy district - Sakshi

సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది.

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని పుల్కల్‌ మండలం కొర్పోల్‌  గ్రామంలో నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. గ్రామంలోని యువకులు హోలీ వేడకలు జరుపుకున్నారు. వేడుకల అనంతరం స్థానిక మంజీర నదిలో స్నానానికి వెళ్లారు.

ఈ క్రమంలో నదిలో దిగిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. చనిపోయిన ఇద్దరు చిన్నారులు సాయికుమార్‌, సాయి కిరణ్‌లుగా గుర్తించారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా హోలీ ఆడిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement