ఆర్టీసీ సమ్మె: బస్సుపై రాళ్ల దాడి | Two Buses Damaged In Adilabad | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె: బస్సుపై రాళ్ల దాడి

Oct 23 2019 9:50 PM | Updated on Oct 23 2019 10:18 PM

Two Buses Damaged In Adilabad - Sakshi

ఆసిఫాబాద్‌: ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉదృతమవుతోంది. ఆసిఫాబాద్‌లోని హనుమాన్‌ విగ్రహం వద్ద రెండు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి ద్వంసం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లతో ప్రభుత్వం బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాగజ్‌నగర్‌ నుంచి ఆసిఫాబాద్‌ వైపు వెళ్తున్న బస్సుపై దుండగులు రాళ్లు విసరడంతో ధ్వంసమైంది. దాంతోపాటు మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న మరో బస్సుపై కూడా ఇదే తరహా దాడి జరిగింది. దీంతో బస్సు స్వల్పంగా ధ్వంసమైంది. ఊహించని ఘటనలతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తులు పరారయ్యారు. దాడులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement