‘కరోనా, శాంతిభద్రతల దృష్ట్యా ఆపాం’ | TS govt. files counter in Congress leaders detention case | Sakshi
Sakshi News home page

‘కరోనా, శాంతిభద్రతల దృష్ట్యా ఆపాం’

Jun 22 2020 4:49 PM | Updated on Jun 22 2020 5:24 PM

TS govt. files counter in Congress leaders detention case - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ‘జల దీక్ష’కు పిలుపునిచ్చి కోవిడ్–19 నిబంధనలను ఉల్లంఘించబోయిన కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లో పేర్కొంది. జల దీక్ష చేపట్టకుండా తమను అక్రమంగా హౌజ్ అరెస్టు చేశారని కాంగ్రెస్ నేతలు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.(సంతోష్‌ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ పరామర్శ)

దీనిపై గతంలో వాదనలు విన్న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు దాఖలు చేసిన కౌంటర్ లో ప్రభుత్వం కాంగ్రెస్ నేతలు ఆరోగ్య శాఖ సూచనలను ఎక్కడా పాటించలేదని పేర్కొంది. కేవలం రాజకీయ అజెండాతోనే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జల దీక్షకు పిలుపునిచ్చారని తెలిపింది. దీక్ష కోసం పోలీసుల అనుమతి కూడా తీసుకోలేదని వెల్లడించింది.(ఇసుక మాఫియాపై హైకోర్టు జోక్యం)

కరోనా విజృంభణ, శాంతి భద్రతల కారణాలతోనే కాంగ్రెస్ నాయకులను ఇంటి వద్దే ఆపినట్లు ప్రభుత్వం తన కౌంటర్ లో పేర్కొంది. దీనిపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది రచనా రెడ్డి, త్వరలోనే రిప్లై కౌంటర్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement