మా వాళ్లను గెలిపించండి: కాంగ్రెస్ | try to success of our candidates: uttamkumarreddy | Sakshi
Sakshi News home page

మా వాళ్లను గెలిపించండి: కాంగ్రెస్

Mar 16 2015 5:18 PM | Updated on Mar 18 2019 9:02 PM

మా వాళ్లను గెలిపించండి: కాంగ్రెస్ - Sakshi

మా వాళ్లను గెలిపించండి: కాంగ్రెస్

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేలా నేతలు కృషి చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, డీ శ్రీనివాస్ సూచించారు.

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేలా నేతలు కృషి చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, డీ శ్రీనివాస్ సూచించారు. ఇచ్చిన హమీల అమలు విషయంలో కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని వారు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను పట్టభద్రులు గ్రహించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేయాలని కోరారు.

 

హై కమాండ్ ఆదేశం మేరకే ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నామని, ప్రచారం కూడా ఆలస్యంగా ప్రారంభించామని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి అవినీతికి సంబంధించి తమ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ నుంచి పూర్తి సమాచారం తీసుకుంటున్నామని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు. జగదీశ్ రెడ్డి చెల్లని రూపాయి అని, ఆయన సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారని జానారెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పన్షన్ను ఎత్తివేసి సభకు రప్పించడం సబబుగా ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement