చంద్రబాబు ఏజెంట్‌వి నువ్వు..

TRS Leader Balka Suman Comments On Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చంద్రబాబు ఏజెంట్‌లా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాడని ఎంపీ బాల్క సుమన్‌ విమర్శించారు. రేవంత్‌ ఆర్థిక అరాచకవాది అని దుయ్యబట్టారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్యదర్శి గట్టు రాంచందర్‌రావులతో కలసి బాల్క సుమన్‌ విలేకరులతో మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి స్వాతిముత్యంలో కమల్‌హాసన్‌ కాదు, విశ్వరూపం కమల్‌హాసన్‌. ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌ విషయాలు ఏమీ చెప్పలేదు. బట్టకాల్చి మీద వేసినట్లుగా మాట్లాడుతున్నారు. మీడియాలో వచ్చిన ఏ ఒక్క అంశానికీ సమాధానం చెప్పలేదు. బాల్క సుమన్‌ మీద మాట్లాడతావా? తోలు తీస్తాం. రేవంత్‌ గురించి మాట్లాడేందుకు నేను చాలు.

నన్ను మా పార్టీ వాళ్లు ఆపుతున్నారు. లేదంటే ఉరికించి కొడతా, తాట తీస్తా. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ వెయ్యి ఎకరాలంటున్నావ్‌. నిరూపించకపోతే గజ్వేల్‌లో బొంద పెడతాం. దమ్ముంటే విచారణ ఎదుర్కో. నీ బండారం బయటపెడతా. అసెంబ్లీలో బాల్క సుమన్‌ కూర్చుంటాడో.. రేవంత్‌ కూర్చుంటాడో తేల్చుకుందాం. నిప్పులాంటి కేసీఆర్‌ కుటుంబం మీద ఆరోపణలు చేస్తావా. చిల్లరగాళ్లను వెంట బెట్టుకొని మాట్లాడతావా. కేసీఆర్‌కు ఆస్తులు అవసరం లేదు. నీ ఆస్తులపై, నా ఆస్తులపై విచారణకు సిద్ధం. మా ఎమ్మెల్యేలపై, ఎంపీలపై ఐటీ సోదాలు జరిగాయి. నీ మీద ఐటీ సోదాలకు, టీఆర్‌ఎస్‌కు ఏం సంబంధం’అని ప్రశ్నించారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top